చంద్రయాన్ 3 సక్సెస్..మళ్ళీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్‌

ఆదిపురుష్ సినిమా విడుదలై ప్లాప్ టాక్ కూడా తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ సినిమాపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటించగా ఓం రావత్ దర్శకత్వం వహించారు. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? బుధవారం చంద్రయాన్ 3 విజయవంతం అయిన విషయం అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మళ్ళీ ఆదిపురుష్ సినిమా తెరపైకి వచ్చింది. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది.

ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 700 కోట్లు కాగా విజయవంతమైన చంద్రయాన్ 3 ఖర్చు కేవలం 615 కోట్లు మాత్రమే. దీంతో సినిమా ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 సక్సెస్ సాధించిందని, మరి 700 కోట్లు ఖర్చు పెట్టి ఆదిపురుష్ ఏం సాధించిందని ట్రోల్ల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆదిపురుష్ సినిమాపై మళ్ళీ ట్రోల్ల్స్ మొదలయాయ్యి. చంద్రయాన్ 3 తో భారత్ చరిత్ర సృష్టించింది. దీంతో తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఇన్ని కోట్లు పెట్టి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చు పెడితే మరిన్ని విజయాలు సాధించొచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే కొన్ని సినిమాలు ఖర్చు పట్టించుకోకుండా పెడుతూనే ఉన్నారు. కోట్లల్లో సినిమాలు తీస్తున్నారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ నోలన్‌ కూడా ‘ఓపెన్‌హైమర్‌’ సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఇదే దర్శకుడు గతంలో ఒక సినిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 అతి తక్కువ ఖర్చుతో చరిత్ర సృష్టించడంతో అందరు షాక్ అవుతున్నారు. ప్లాప్ సినిమాల కంటే తక్కువ ఖర్చుతో విజయం సాధించిందని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మళ్ళీ తెరపైకి వచ్చింది.