‘ ఫ్రెంచ్ కిస్ ‘ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా…. అసలు కారణం ఇద…!

నాలుగు పెదాలు కలిసి పెట్టుకునే ముద్దుకు ఆ పేరు ఎలా వచ్చింది..? ఎప్పుడు వచ్చింది.

ముక్కపై ముద్దు పెట్టు ముక్కెర పోయేట్టు

చెంపపై ముద్దు పెట్టు చక్కరై పోయేట్టు

మీసం పై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు

గుండెపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు…

అంటూ ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం చెప్పే పాట ‘ చందమామ ‘ సినిమాలో సాయి శ్రీహర్ష అద్భుతంగా వర్ణించాడు. అయితే ముద్దులో ఫ్రెంచ్ కిస్ వేరయ్య అంటున్నారు ముద్దు ప్రియులు. పిల్లలకు పెద్దవారు పెట్టే ముద్దు నుంచి… భార్యకు భర్త పెట్టే ముద్దు వరకు ప్రేమ ఉంటుందని అంటుంటారు. ఆ ముద్దుని ఫ్రెంచ్ కిస్ అని పిలవడంలో ప్రపంచ యుద్ధం ఉందని తెలుస్తుంది. అవును ఫ్రెంచ్ కిస్ అనేది ఒక ప్రేమతో పెట్టే ముద్దు.

నాలుగు పెదాలు కలుసుకుంటున్న సమయంలో వారి రెండు నాలుకలు నాట్యం ఆడుతూ ఉంటాయి. ఫలితంగా ఇవి స్పర్శకు సున్నితంగా ఉండటంతో లైంగిక ప్రేరేపణను ప్రేరేపిస్తాయి. ఎందుకంటే నోటి జోన్ శరీరంలోని ప్రధాన ఎరోజెనస్ ఒకటి. ఫ్రెంచ్ కిస్ ఇద్దరి ప్రేమకు మధ్య ప్రతిరూపమని అంటుంటారు. మరి దీనికి ఫ్రెంచ్ కిస్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా- బ్రిటిష్ సైనికులకు ఫ్రాన్స్ లో మంచి ఆతిథ్యం లభించిందట. ఈ సైనికులు అక్కడ ఉన్నప్పుడు ఫ్రాన్స్ తో ఏర్పడిన సంబంధం ఓ తీపి గుర్తుగా మిగిలిపోయేదట. దీనికి కారణం.. అక్కడి మహిళలు పెట్టే ముద్దు అట.

అంటే ఆ స్థాయిలో ఉండేదన్నమాట ఆ ముద్దు. సాధారణంగా అమెరికన్లు- బ్రిటిషన్లు గౌరవ సాంప్రదాయంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అనంతరం ఫ్రాన్స్ నుంచి తమ దేశానికి తిరిగి వెళ్లిన తరువాత అక్కడ ప్రజలకు కూడా ఈ ముద్దుని పరిచయం చేశారట. అప్పటినుంచి దీన్ని ఫ్రెంచ్ కిస్ అని అందరికీ తెలుస్తుంది. ఇక రెండో ప్రపంచ యుద్ధం సమయానికి ఫ్రెంచ్ కిస్ హద్దులు దాటేసిందట. వారికోసం వెళ్ళిన వారు ఫ్రాన్స్ లో టంగ్ వార్ తెలుసుకొని బాగా అలవాటు పడ్డారట. అయితే ఈ ముద్దుని అమెరికా, బ్రిటన్ లలో ఫ్రెంచ్ కిస్ అని పిలిస్తే ఫ్రాన్స్ లో మాత్రం.. దీనిని అన్ బైసర్ అమోరియక్స్ (ప్రేమికుల ముద్దు) అన్ బైసర్ అవెక్ లా లాంగ్యూ (నాలుకతో ముద్దు) అని పిలుస్తారట. అది మేటర్… ఈ ఫ్రెంచ్ కిస్ కి ఇంత చరిత్ర ఉందన్నమాట! ఫ్రాన్స్ అమ్మాయిలా మజాకా…!!