టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఒకప్పుడు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగేది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలనుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. ఆ తర్వాత ఎఫైర్లు పలు రకాల రూమర్ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నది.. అయితే గత కొద్ది రోజుల క్రితం తను గర్భవతి నంటు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తను డెలివరీ అయినట్టుగా తెలియజేస్తూ తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
తన కొడుకు పేరును రివిల్ చేయడమే కాకుండా ఏకాంగ తన కొడుకు ఫోటోను షేర్ చేసింది.. నా ప్రియమైన అబ్బాయి కోవా ఫినిక్స్ డోలన్ ను పరిచయం చేస్తున్నాను మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాయో మాటలలో చెప్పలేను అంటూ తన సంతోషాన్ని షేర్ చేయడం జరిగింది ఇలియానా. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలకు పలువురు అభిమానులు నెట్టిజన్లు సైతం ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇలియానా గతంలో తల్లి కాబోతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నది. కానీ ఇలియానా వివాహం కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తను కాబోయే భర్త గురించి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ చివరికి అతన్ని కూడా రీవిల్ చేయడం జరిగింది. ఇలియానా భర్త పేరు శభాష్టియన్ లారెంట్ మిచెల్.. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram