పైన కనిపిస్తున్న సినిమా చెట్టు చరిత్ర గురించి మీకు తెలుసా.. హిస్టరీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

పై ఫోటోలో గోదావరి గట్టును ఉన్న ఈ పెద్ద చెట్టు కథను మాటల్లో చెప్పలేం దాని చరిత్ర సెంటిమెంట్ 100 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వస్తుంది. 1964 నుంచి ఇప్పటివరకు ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ చెట్టు కింద షూటింగ్ జరిగితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం దర్శకులు స్టార్ హీరోల్లో ఎంతో బలంగా నాటుకు పోయింది.

ఎన్నో వందల సినిమా షూటింగ్లో జరుపుకున్న ఈ చెట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం లో ఉంది. 150 సంవత్సరాల కింద సింగలూరు తాతబ్బాయి అనే ఆయన ఈ చెట్టును నాటినట్లు అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి షూటింగ్ కోసం ఉన్న లొకేషన్ లో గోదావరి కూడా ఒకటి. గోదావరి తీరంలో సినిమా తీస్తే మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు.

ఇలా గోదావరి తీరంలో సినిమాలు తీసి విజయాలు అందుకున్న దర్శకులలో ఎందరో అగ్ర దర్శకులు ఉన్నారు. వారిలో లెజెండ్రీ దర్శకులు దాసరి నారాయణరావు, బాపు, కే విశ్వనాథ్, కృష్ణవంశీ, డైరెక్టర్ సుకుమార్ కూడా ఇక్కడే సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. అలాగే టాలీవుడ్ అగ్ర హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, కమలహాసన్, బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు కూడా ఎన్నో సినిమాలలో గోదావరి తీరంలో నటించారు. పైన కనిపిస్తున్న చెట్టు దగ్గర ముందుగా 1964లో మూగమనసులు సినిమాలోని ఓ పాటను తెరకెక్కించారు.

ఆ సినిమా దగ్గరనుంచి ఈ చెట్టు ప్రభావం చిత్ర పరిశ్రమపై పడింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాడిపంటలు సినిమా కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. అలాగే చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు, మహేష్ బాబు హీరోకి వచ్చిన మురారి వంటి సినిమాల్లోనూ ఈ చెట్టు దర్శనమిస్తుంది.ఇప్పటికీ ఈ చెట్టు దగ్గర సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రామ్‌చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో కూడా ఈ చెట్టు కనిపిస్తుంది.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో ఈ చెట్టు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ చెట్టు కనిపించిన ప్రతి సినిమా టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచాయి. గోదావరి గట్టునే ఉండే ఈ నిద్ర గన్నేరు చెట్టు ఇప్పటికీ టాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.