న‌వంబ‌ర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వ‌రుణ్ తేజ్‌.. లావ‌ణ్య‌తో పెళ్లెప్పుడంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన ఈ జంట‌.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవ‌లె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంగా వైభ‌వంగా జ‌రిగింది. ఆగ‌స్టులో వీరిద్ద‌రూ ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా కూడా మెగా ఇంట ఆ హ‌డావుడి ఏమీ క‌నిపించ‌లేదు.

వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం `గాండీవ‌ధారి అర్జున‌` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లెప్పుడు..? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది. తాజాగా దానికి స‌మాధానం దొరికింది. న‌వంబ‌ర్ లో వ‌రుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

న‌వంబ‌ర్ 1న లావ‌ణ్య త్రిపాఠి మెడ‌లో మూడు ముళ్లు వేసి ఏడ‌డుగులు వేయ‌బోతున్నారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక‌లు అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే వివాహ వేదిక‌ మాత్రం ఇంత వ‌ర‌కు ఫైన‌ల్ కాలేదు. ఇప్ప‌టికే వ‌రుణ్‌, లావ‌ణ్య క‌లిసి ఇండియాలో మూడు, ఫారెన్ లో రెండు ప్లేస్ ల‌ను సెల‌క్ట్ చేసుకున్నాడు. వాటిలోనే ఒక ప్లేస్ ను త‌మ పెళ్లి వేదిక‌గా ఫిక్స్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.