ట్రెడిషనల్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న రీతూ వర్మ.. క్యూట్ పిక్స్ వైరల్..

ప్రముఖ హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ప్రేమ ఇష్క్  కాదల్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో బాగా ఫేమస్ అయింది రీతూ వర్మ. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ‘బాద్షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలుగా నటించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతు వర్మ అటు తెలుగులో,ఇటు తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రావడం లేదు. చివరిగా రీతు వర్మ తెలుగు లో నటించిన నిన్నిలా నిన్నిలా , టక్ జగదీష్, ఒకే ఒక జీవితం లాంటి సినిమా లు విజయం సాధించలేకపోయ్యాయి. దాంతో ఈ చిన్నది ప్రస్తుతం తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తుంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం ‘ అనే సినిమా తమిళం, తెలుగు లో బైలింగ్వుల్ లో తెరకేక్కించిన ఈ సినిమా లో నటించిన తరువాత రీతూ కోలీవుడ్ లో ఎక్కువగా సందడి చేస్తుంది. ప్రస్తుతం రీతూ కోలీవుడ్ లో రెండు సినిమా లో నటిస్తూ బిజీ గా ఉంది. మార్క్ ఆంటోనీ, ధృవ నక్షత్రం లాంటి  సినిమా లో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి


అయితే తెలుగు అభిమానులు మాత్రం రీతూ ఇంకెప్పుడు తెలుగు సినిమా లో కనపడుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా రీతు వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తను అందంగా తయారై దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ దిగిన ఫోటోలు చూసి అభిమానులు ఖుషి అవుతుంటారు. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో కనపడి అందరి చూపు తన వైపుకి తిప్పేలా చేసింది రీతూ. తన అందమైన నవ్వుతో , క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందరిని కట్టిపడేసింది. ప్రస్తుతం రీతు వర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.