మెగాస్టార్ 156పై ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది… ఆ డైరెక్ట‌ర్‌ను పీకి ప‌క్క‌న ప‌డేశారుగా…!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నేడు మెగా ఫ్యాన్స్ తో పాటు చాలామంది ప్రముఖ సినీ తారలు కూడా మెగాస్టార్‌కి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. దాంతోపాటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన 156వ‌ సినిమాపై కూడా ఒక అధికారిక క్లారిటీ వచ్చింది. ఈ సినిమా పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇక తన నెక్స్ట్ సినిమాలపై కూడా కొన్ని సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇక మెగాస్టార్ 156వ‌ సినిమా ప్రెసెంట్ మెగాస్టార్ పెద్ద కూతురు స్టైలిస్ట్ అయినా సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్వహిస్తున్నట్టు అధికారిగా అప్డేట్ ఎప్పుడో వచ్చేసింది. అయితే ఈరోజు బర్త్డే కానుకగా ఈ అప్డేట్ ని మేకర్స్ పోస్టర్ రూపంలో అందించారు. గతంలో ఈ సినిమాకు బంగార్రాజు మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వాహించ‌బోతున్నాడంటు అంటూ అధికారిక ప్రకటన కూడా చేశారు.

కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో డైరెక్టర్ పేరు ఇవ్వకపోవడంతో కళ్యాణ్ కృష్ణకు షాక్ ఎదురైనట్లుంది. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాకపోతే మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇక దీంతో పాటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ – వశిష్ట కాంబోలో రూపొందుతున్న 157వ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా యువి బ్యానర్స్‌ క్రియేషన్ పై రూపొందించబడుతుంది.