నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి రీజన్ అదే.. డైలీ రాత్రి పడుకునేటప్పుడు అలా చేయాల్సిందేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. అక్కినేని నాగార్జున గారి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . నటన పరంగా ఎంతో మంది హీరోలు మెప్పించిన.. అందం పరంగా మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నాడు నాగార్జున . మహేష్ బాబు కూడా ఈయన తర్వాత అని చెప్పడంలో సందేహం లేదు . పలువురు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు అందరూ నాగార్జునకు డై హార్ట్ ఫ్యాన్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అంతలా ఇప్పటికీ మన్మధుడు స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు నాగార్జున .

ఇదే క్రమంలో 60 ఏళ్లు దాటినా సరే ఇంకా నాగార్జున అంత యంగ్ లుక్ లో కనిపించడానికి రీజన్ ఏంటా అంటూ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఆయన అటెండ్ అయినా ప్రతి ఇంటర్వ్యూ లోను ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది . నాగార్జున తన ఫుడ్ డైట్ సీక్రెట్స్ బయట పెట్టకపోయినా.. వర్కౌట్ సీక్రెట్స్ మాత్రం బయటపెట్టేసాడు . తాను అందరిలా ఫుడ్ రిస్ట్రిక్టెడ్ గా తిననని ..నచ్చిన ఫుడ్ నచ్చినంత స్థాయిలో తినేస్తానని ..కానీ తిన్న ప్రతిసారి దానికి తగ్గట్టు వర్కౌట్ చేసి కేలరీస్ లో బర్న్ చేస్తానని చెప్పుకొచ్చారు .

అంతేకాదు ఎక్కువగా నట్స్ తీసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు వాటర్ కూడా ఎక్కువ కంటెంట్ లో తీసుకుంటారట. మరీ ముఖ్యంగా ఎంత టైం అయినా ఎలాంటి పొజిషన్లో అయినా రాత్రి కచ్చితంగా రెండు గంటలు వాక్ చేసే పడుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున అందంగా ఉండటానికి సీక్రెట్ ఇదే అంటూ వైరల్ గా మారింది ..సో ఇంకెందుకు ఆలస్యం.. మీరు నాగార్జున లాగా ఈ వర్కౌట్ చేసి అక్కినేని హీరోలాగా తయారైపోండి..!!