కమెడియన్ వడివేలు వేధింపులపై బాంబు పేల్చిన నటి..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు సైతం కమెడియన్ వడివేలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో తెలుగు తమిళ్ కన్నడ వంటి చిత్రాలలో నటించి మంచి కమెడియన్గా పేరు సంపాదించారు.. ఏన్నో సినిమాలలో కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించిన వడివేలు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. ఇటీవల కాలంలో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటు ఉన్నారు.. తాజాగా విడుదలైన ఒక చిత్రంలో వడివేలు చాలా అద్భుతమైన నటనను సైతం కనబరిచారు..

വടിവേലു പറയുന്നു: തിരുമ്പി വന്തിട്ടേന്ന് സൊല്ല്- Actor Vadivelu | Mamannan  | Tamil Movies Premium

అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించిన వడివేలు మాయన్నన్ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పలువురు నటీనటులు ఆయన పైన పలు ఆరోపణలు చేస్తూ ఉంటే నటి షకీలా కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.. షకీలా తమిళ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఒక యూట్యూబ్ ఛానల్ కోసం నటీనటులు ఇంటర్వ్యూ ఇవ్వగ అందులో భాగంగా తమిళ నటి ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది..

తన సిని కెరియర్ లో వడివేలు, వివేక్ ,సంతానం వంటి హాస్యనటులతో చిన్నచిన్న క్యారెక్టర్లలో నటించాను తనకు అప్పట్లో మంచి అవకాశాలు వచ్చేవీ.. నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్టు వేశారు సినిమాలలో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి కానీ ఆయన వల్ల అవి చాలా ఆగిపోయాయని తెలిపింది.. అయితే అనుకోకుండా ఒకసారి అవకాశం వచ్చింది కదా అని షూటింగ్ కి వెళ్లాను కానీ అక్కడ వడివేలు తనని చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడ మూవీ మేకర్స్ కి చెప్పి వెనక్కి పంపించారట..ఇలా ఎన్నో సినిమాలలో జరిగింది అని చెప్పింది ప్రేమ ప్రియ.. దీంతో ఒక దర్శకుడు తనని ఫోన్లో బెదిరించారని యూట్యూబ్ ఛానల్స్ లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని చెప్పమంటూ బెదిరించారట.. కానీ తను భయపడకుండా ఏదైతే చెప్పాను అది నిజమే చెప్పానని తెలిపింది.