‘ జైలర్ ‘ మూవీలో రజనీకాంత్ కొడుకు రోల్ లో నటించిన నటుడు ఎవరో తెలుసా..?

సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన సినిమా జైలర్. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ఫుల్ క్రేజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నువ్వు కావాలయ్యా పాటకు తమన్నా స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో నటించిన నటుడు గురించి చాలా మందికి తెలియదు. రెండు రకాల షేడ్స్‌ ఉన్న రోల్‌లో నటించిన అతని పేరు వసంత్‌ రవి. చెన్నైలో బాగా పాపులర్ అయిన నమ్మవీడు వసంత భవన్ రెస్టారెంట్ చైర్మన్ కొడుకు. తారామ‌ణి మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వసంత్‌ మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు.

ఆ తర్వాత రాకీ మరియు అస్విన్స్ మూవీలో నటించిన వసంత్ తాజాగా ఇప్పుడు జైల‌ర్ సినిమాలో రజనీకాంత్ కొడుకు రోల్‌లో నటించి మెప్పించాడు. సినిమాల్లో ఏసిపి అర్జున్ పాత్రలో క‌నిప్పించాడు వసంత్. క్లైమాక్స్‌లో తన పాత్రకి మంచి ట్విస్ట్ ఉంది. వసంత్ తన పాత్రలో జీవించాడు. రమ్యకృష్ణ, మీర్నామీనన్, వినాయకన్, యోగిబాబు కీరోల్స్ ప్లే చేసిన‌ ఈ మూవీలో మోహన్‌లాల్, జాకీ ష్రాప్, సునీల్, తమన్న, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్‌లో కనిపించారు.