ట్రావెల్ + లేజర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐ కాన్ స్టార్.. స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడుగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్పాది రైజ్‌ సినిమాతో టాలీవుడ్‌లోనే కాక పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బ‌న్నీ స్టైలిష్ లుక్స్‌కి కూడా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ తన అల్ట్రా స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే అల్లు అర్జున్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన అల్లు అర్జున్ తాజాగా మరో ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థకు అంబాసిడర్‌గా సైన్ చేశాడు.

ట్రావెల్ + లీజర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ బన్నీ దిగిన ప్రత్యేకమైన ఫోటోషూట్‌ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రావెల్ + లీజర్ సౌత్ ఏషియా అండ్ ఇండియాలో ప్రముఖ పట్టణాలలో పాపులారిటీ సంపాదించుకుంటున్న సంస్థ. ఈ సంస్థ తమ ప్రొడక్ట్స్ ప్రతినిధిగా అల్లు అర్జున్‌ని ప్రకటించడంతోపాటు బన్నీకి సంబంధించిన ఎంతో స్టైలిష్ లుక్స్ ఫొటోస్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫొటోస్ లో అల్లు అర్జున్ మరింత స్టైలిష్‌గా కోట్లాదిమంది మనసులను దోచుకున్నాడు.

లాంగ్ కర్లీ హెయిర్ తో.. జిల్ జిగేల్ మనిపించే డ్రెస్ లో బన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులతో కనిపించాడు. ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడు ఒకే రకంగా నడవదు ఈ విషయాన్ని బన్నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఇప్పటికే డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్న బన్నీ ప్ర‌తి సినిమాకి లుక్ ను చేంజ్ చేసేస్తాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాది రూలర్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.