చిరంజీవికి ఆ హీరోయిన్ ఎందుకు అంత స్పెషలో తెలుసా..?

 తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అంటే గౌరవిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంకొకసారి రీమిక్స్ సినిమాలు చేయకండి అంటూ మెగా అభిమానుల సైతం చిరంజీవికి తెలియజేయడం జరుగుతోంది.ఇదంతా పక్కన పెడితే చిరంజీవి కెరియర్ లో ఒక హీరోయిన్ కోసం చిరంజీవి ఎవరికి ఇవ్వని ఒక వస్తువుని ఇచ్చారట.

Ramya Krishna to play the sister role of senior hero

ఒకానొక సమయంలో హీరోయిన్ మాధవి కారులో తనపక్కల కూర్చోవడానికి ఇష్టపడలేదని విషయాన్ని గ్రహించిన చిరంజీవి ఆ తర్వాత ఏ కొత్త కారు వచ్చిన సరే ఆ కారును కొనుక్కొని తన రేంజ్ ఏంటో చూపించే వారట. అలా దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితమే మూడు కోట్లు పెట్టి ఒక ఖరీదైన కారణం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆ కారుని చాలా జాగ్రత్తగా చూసుకొనే వారట. ఆ కారు మీద చిన్న గీత పడ్డ కూడా చిరంజీవి డ్రైవర్ని అరిచే వారిని సమాచారం. అయితే అలా ఎంతో ఇష్టమైన కారుని మాత్రం రమ్యకృష్ణ కోసం ఇచ్చేవారట.

padayappa rajinikanth padam,Save up to 16%,khiwaniandco.com

రమ్యకృష్ణ నరసింహ సినిమాలో ఒక స్టైలిష్ కారులో ఎంట్రీ ఇచ్చేసి అందరికీ గుర్తుంటుంది..అయితే ఈ సీన్ లో కారు చిరంజీవిదే నట.. అందులో నుంచి రమ్యకృష్ణ దిగుతుందట. డైరెక్టర్ ముందుగా రమ్యకృష్ణ ఎంట్రీనా చాలా వెరైటీగా స్టైలిష్ గా ఉండాలని డైరెక్టర్ అనుకున్నారట ఆ సమయంలో మార్కెట్లో ఉండే కార్లన్నీ వెతికినప్పటికీ ఏ ఒక్క కారు కూడా నచ్చలేదట. కానీ ఒకసారి రమ్యకృష్ణ ,చిరంజీవి ఇంటికి పనిమీద వెళ్ళినప్పుడు చిరంజీవి కారు చూసి బాగుంది షూటింగ్ కోసం ఇస్తారా అని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చిరంజీవి సరే అని ఇచ్చారట. రమ్యకృష్ణ చిరంజీవి మధ్య ఎంత స్నేహబంధం ఉందో తెలుస్తోంది..