ఈ బుజ్జి పాప ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. జాతీయ అవార్డు కూడా అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నటినటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. త్రో బ్యాక్ ట్రెండ్‌ పేరుతో ఎప్పటికప్పుడు వారి చైల్డ్‌హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పై ఫోటోలో వాళ్ళ నాన్న ఒడిలో కూర్చొని క్యూట్ గా చూస్తున్న ఈ బుజ్జి పాప ఎవ‌రో గుర్తుప‌ట్టార‌..ఈ బుజ్జి పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాతీయ అవార్డు కూడా అందుకుంది ఎవరో గుర్తుపట్టారా ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఇటీవల జాతీయ అవార్డు అందుకుంది.

ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ‌ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు సరసన నటించింది. ఈ బ్యూటీ ఇటీవల చిరంజీవితో క‌లిసి న‌టించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె కీర్తి సురేష్ మహానటి సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత పాన్ ఇండియా సినిమా నాని సరసన దసరా సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇటీవల చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. ఇక గతంలో ఇమె పెళ్లి గురించి కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిలో నిజం లేదని ఆమె ఖండించింది. ఇక కీర్తి సురేష్ నెక్స్ట్ నాగచైతన్య హీరోగా చందు మోండేటి దర్శకత్వంలో మరో సినిమా తీయబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడ‌ట.