వెండితెరపై సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా..?

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఆయన గురించి ఎన్నో అంశాలు టచ్ చేస్తూ తీసిన సినిమాలు ఇప్పటికీ ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఓ సినిమా సుభాష్ చంద్రబోస్. 2005లో విడుదలైన ఈ సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది.

కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వెంకటేష్, శ్రెయా శరణ్, జెనీలియా హీరోయిన్లుగా, ప్రకాష్ రాజ్ కీ రోల్‌లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో స్వాతంత్రం ముందు బ్రిటిష్‌ వారు వారి దేశానికి వెళ్లబోయే దశను చూపించారు. నేతాజీ జీవితం ఆధారంగా వచ్చిన మరో సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ఫర్గాటెన్ హీరో. 2004లో హిందీలో రిలీజైన‌ ఈ సినిమా ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ ఫిలిం గా రూపొందింది.

సచ్చిన్ ఖేడేకర్, కుల్బుషన్ కర్బందా, రజిత్ కపూర్, అర్తిఫ్ జాకారియా, దివ్య దత్త కీలక పాత్ర‌లో నటించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రిటిష్, ఇండియా మధ్యన మహాత్మా గాంధీతో రాజకీయ విభేదాల తర్వాత చంద్రబోస్ అరెస్ట్ అయి విడుదలయ్యాక జరిగిన కథనాలను వివరించారు. ఈ సినిమాకి భారత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో ఆగస్టు 14 – 2016న 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకుంటూ ఇండియ‌న్‌ డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.

ఈ సినిమాలతో పాటూ నేతాజీ జీవిత చరిత్రపై సిరీస్‌ కూడా వచ్చింది. బోస్ డెడ్/ఎల‌ఐవ్‌ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ హిస్టారికల్ డ్రామాగా నడిచింది. రైటర్ రేష్ నాథ్ రచించిన ఈ కథకు పుల్కిట్ దర్శకత్వం వహించాడు. నవీన్ కస్తూరియా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు నటించారు. నీల్ సంగీతం అందించాడు. 9 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ విడుదల అయింది. 18 ఆగస్టు 1945న ఓవర్‌సిస్లో జపనీస్ విమానం కూలిపోవడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్లు భావించారు. ఆయన మరణం పై ఇప్పటికీ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. స్పష్టత లేదు ఈ స్టోరీతో కాస్త ఆ విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 2018లో ఈ సిరీస్‌ విడుదల అయింది.

తర్వాత చంద్రబోస్ డెత్ మిస్టరీ పైన వచ్చిన సినిమా గుమ్నామి. ఈ సినిమా శ్రీజిత్ ముఖర్జీ డైరెక్టర్గా యదార్థ సంఘటనల ఆధారంగా 2018లో రూపొందింది. భారతీయ, బెంగాలీ లాంగ్వేజ్ లో మిస్టరీ మూవీ ఇది. నేతాజీ డెత్ మిస్టరీని ముఖర్జీ కాన్చంద్ కమిషన్ విచారణలు.. రైటర్ అంజు రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించాడు. శ్రీ వెంకటేశ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీకాంత్ మాత్రా, ప్రణయ్ రంజన్, మహేంద్ర సోనీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. నటుడు ప్రాసెంజిత్ చటర్జీ సుభాష్ చంద్రబోస్, గుమినామీ బాబా పాత్రలను పోషించాడు. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

సుభాష్ చంద్రబోస్ అనే టైటిల్ తోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా 1966లో రిలీజ్ అయిన ఈ మూవీలో విద్యార్థి దశ నుంచి ఫ్రీడమ్ ఫైటర్గా సుభాష్ చంద్రబోస్ ఎలా మారారు అనేది ఈ సినిమా ద్వారా చూపించాడు ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. ఇక తాజాగా 2023లో సుభాష్ చంద్రబోస్ జీవిత ఆధారంగానే స్పై సినిమా కూడా రూపొందింది. గ్యారీ బిహెచ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కథ కే రాజశేఖర్ రెడ్డి రచించారు. నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్య మీనన్ అభినవ్, ఆర్యన్ రాజేష్, రవివర్మ, సచిన్ కేడేకర్ ఈ సినిమాలో కీరోల్స్ లో నటించారు. స్పై ప్రపంచవ్యాప్తంగా 2023 జూన్ 29న రిలీజ్ అయింది.