నా త‌మ్ముడిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి… మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్స్‌

మంచు విష్ణు కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు సినీవారసుడు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాల్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంట‌ర్వ్యులో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారి నా..?అంటూ విష్ణు క‌మెంట్ చేశాడు. ఆయన సినిమాల గురించి అడిగితే నేను చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్ సందేహమే లేదు.

ఆయ‌న‌కి సంబంధించిన ఒక సినిమా అడగకపోయినా మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. రాజకీయాల గురించి అయితే నేను చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్ గా ఉన్నారని హీరోకు సంబంధించిన సినిమాలు వస్తే చూస్తారేమో..? కానీ ఓట్ల విషయానికొస్తే తమకు నచ్చిన వ్య‌క్తికే ఓట్లు వేసి గెలిపిస్తారని తన అభిప్రాయాన్ని వివ‌రించాడు. సినిమా రంగానికి చెందిన ఎంతోమంది టాప్ మోస్ట్ స్టార్ హీరోలు కూడా రాజకీయాల్లో ఓడిపోయారని గుర్తు చేశాడు. ఒకసారి పాలిటిక్స్ లో పేరుపొందిన లెజెండ్రీ పర్సన్స్ నీ కూడా ప్రజలు ఓడించారన్నాడు.

రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాం, తన దేశం, తన జీవితం బాగు చేస్తారని నమ్మితే వారి వైపే ప్రజలు ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు. మరో 6 నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్తు ఏంటనేది చెబుతానని విష్ణు అన్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ నేను ప్రజెంట్ సినీ కెరీర్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని భక్త కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్లో వ‌స్తుంద‌ని ఇందులో చాలామంది స్టార్ యాక్టర్స్ కనిపించబోతున్నారని వివరించాడు. ఈ సినిమా కోసం రూ.150 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని.. తన మార్కెట్కు మించి బడ్జెట్ పెడుతున్నానని విష్ణు వివరించాడు. నేను చంద్రగిరి లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి మోహిత్‌ని చంద్రగిరిలో నిలబెట్టబోతున్నాడు అని తెలుస్తోంది. మోహిత్ నా తమ్ముడు.. అతని నేను చాలా అభిమానిస్తాను. అతనికి నా సపోర్ట్ కావాలంటే తప్పకుండా ఉంటుంది అంటూ విష్ణు చెప్పాడు. ఏపీలో నవరత్నాల ప్రోగ్రాం చాలా బాగుందని దానివల్ల చాలామంది పేద ప్రజలు లాభం పొందుతున్నారని దీన్నిబట్టి ఏపీలో మళ్ళీ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని దేశంలో పేరు పొందిన ఎన్నికల సర్వేలన్నీ సూచిస్తున్నాయని ఆయన గుర్తు చేశాడు.