సాయి ప‌ల్ల‌వి బెడ్ రూమ్ మొత్తం ఆ హీరో ఫోటోలేనా.. హైబ్రిడ్ పిల్ల క‌నిపించ‌దు గానీ మ‌హా ముదురు!

హైబ్రిడ్ పిల్ల అంటే మొద‌ట గుర్తుకువ‌చ్చే పేరు సాయి ప‌ల్ల‌వి. ఫిదా మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ న్యాచుర‌ల్ బ్యూటీ.. ఆ త‌ర్వాత సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయింది. సౌత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడున్న హీరోయిన్లంతా గ్లామ‌ర్ పుంత‌లు తొక్కుతుంటే.. సాయి ప‌ల్ల‌వి మాత్రం స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవ‌లం త‌న ప్ర‌తిభ‌తో ప్రేక్షకుల‌ను అల‌రిస్తోంది.

హీరోయిన్లంద‌రిలోనూ సాయి ప‌ల్ల‌వి చాలా ప్ర‌త్యేకం. వివాదాల‌కు, వివాదాస్పద వ్యాఖ్య‌లు వీలైనంత వ‌ర‌కు దూరంగానే ఉంటుంది. ఏ హీరో తో కూడా స్నేహం చెయ్యదు , ఒకవేళ స్నేహం చేసిన అది ఆ సినిమా వరకే ఉంటుంది. అలాంటి సాయి ప‌ల్ల‌వికి ఓ హీరో అంటే పిచ్చి ఇస్ట‌మ‌ట‌. ఎంత అంటే అత‌ని ఫోటోల‌తో త‌న బెడ్ రూమ్ మొత్తం నింపేసేంత‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. చిన్న‌త‌నం నుంచి సాయి ప‌ల్ల‌వికి ర‌జ‌నీకాంత్ అంటే ఎంతో అభిమాన‌ట‌.

ఇప్ప‌టికీ ఆయ‌న్ను ఆరాధిస్తూనే ఉంది. అంతేకాదు సాయి ప‌ల్ల‌వి బెడ్ రూమ్ మొత్తం రజినీకాంత్ ఫొటోలే ఉంటాయి. ఒక అభిమానిగా రజినీకాంత్ ని ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది. కాగా, ప్ర‌స్తుతం కోలీవుడ్ లో శివ‌కార్తికేయ‌న్ కు జోడీగా క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో సాయి ప‌ల్ల‌వి ఈ మూవీ చేస్తోంది. ఇది త‌ప్పితే మ‌రో ప్రాజెక్ట్ ఆమె చేతిలో లేదు. వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నా స‌రే కొద్ది నెల‌ల నుంచి సాయి ప‌ల్లవి కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేయ‌డం లేదు. ఈ విష‌యం ఫ్యాన్స్ ను బాగా క‌ల‌వ‌రపెడుతోంది.