తన భ‌ర్త‌కు మ‌రో పెళ్లి చేసిన భార్య‌… హైద‌రాబాద్‌లో యూట్యూబ‌ర్ రెండో పెళ్లిలో సినిమా ట్విస్టులు..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కొద్ది రోజులు ముందు పెళ్లి చేసుకోవడమే కాకుండా అతడు కోరుకున్న మరో యూవ‌తితో దగ్గరుండి పెళ్లి చేయించింది. జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్ర చెప్పిన సమాచారం ప్రకారం బంజారాహిల్స్ సింగాడి కుంట బస్తికి చెందిన ఓ యువతి(20) హోమ్ ట్యూటర్‌గా పనిచేస్తుంది. 2020లో యూసఫ్ గూడాలో ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ అనే 23 ఏళ్ల వయసున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారడంతో 2 వర్గాల పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తూ ఒకే చోట ఉన్నారు. అయితే గాంధీకి.. రోజా అనే అమ్మాయితో ఎఫైర్ ఉందని ఆమెకి తెలియడంతో ఇరుకుటుంబాల మధ్యన వివాదాలు తలెత్తాయి. ఈ గొడవలు పోలీసుల వరకు వెళ్ళ‌యి. రోజా, గాంధీ ఇద్దరు మంచి స్నేహితులమని పోలాసుల‌ని నమ్మించడంతో ఇరువర్గాల మధ్య రాజీకుదార్చి పోలీసులు ఇంటికి పంపించారు. మే 14న ఆ యున‌తిని గాంధీ వివాహం చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలు తీసుకొని మరి ఇద్దరికీ పెళ్లి చేసింది.

పెళ్లి అయిన కొన్నాళ్ళ వరకు సంతోషంగా గడిపిన ఈ జంటకు మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం.. ప్రశ్నిస్తే ఆమెపై చేయి చేసుకోవడం.. దీంతోపాటే గాంధీ, రోజా వీరిద్దరి పెళ్ళికి కొద్దిరోజులు ముందే పెళ్లి చేసుకున్నారని అమెకి తెలిసింది. ఇక ఆమె మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండగా రోజా తనకు సపోర్ట్ గా నిలిచిన సుజీ, సంజీవ్‌, విజయ్, అనంత, జెస్సీకాలతో కలిసి వచ్చి తనకు న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. దీంతో యువతి మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్ర‌యించింది. దీంతో గాంధీ, రోజాలపై కేసు నమోదు చేసిన బంజర హిల్స్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.