భాయ్‌ఫ్రెండ్‌తో ఆ ప‌ని చేసిన త‌ర్వాతే పెళ్లి అంటోన్న స్టార్ హీరోయిన్‌..!

పాన్ ఇండియా బ్యూటీ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్‌ వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నారని ఒకరినొకరు పీకల్లోతుగా ప్రేమించుకుంటున్నారు అంటూ ఎప్పటినుంచో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆ పుకార్లను నిజం చేస్తూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింటే షేర్ చేసి తమ రిలేషన్ కు క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట.

ఇక ప్రస్తుతం అనన్య పాండే డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్ లో భాగంగా ఒ ఇంటర్వ్యూలో పాల్గొంది. అనన్య మాట్లాడుతూ ఆదిత్యతో వర్క్ ,పెళ్లి గురించి హోస్ట్ అడిగినా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. బాలీవుడ్ నటుడు, బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్‌ కపూర్ తో కలిసి పనిచేయడం నాకు చాలా సరదాగా ఉంటుందని చెప్తోంది.

ఆదిత్యతో ఎప్పుడు పని చేస్తానో తెలియదు బట్ అతనితో వర్క్ ను ఎంజాయ్ చేస్తా మంచి స్క్రిప్ట్‌ దొరికితే త్వరలోనే జంటగా స్క్రీన్ పై మీ ముందుకు వస్తాం. ముందు కార్తీక్ తో నటించిన సినిమాకు సీక్వెల్ గా పతి పత్ని ఔర్ వో 2 లేదా అలాంటిదే చేస్తాం అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి పై స్పందిస్తూ నేను ఇంకా చిన్న పిల్లనని ఇప్పట్లో అయితే కాదు కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలని ఉందని క్లారిటీ ఇచ్చింది.