విజ‌య్ సినిమాలో విల‌న్‌గా ధోనీ సినిమా ఎంట్రీ… త‌గ్గేదేలే అంటూ…!

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధోని నటుడిగా తెరపై కనిపించబోతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ గా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన ఎంఎస్ ధోని రీసెంట్గా సినిమా రంగంలో కూడా అడుగు పెట్టాడు. ఓ నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మిస్తున్నారు. ధనాధన్ షాట్లతో జార్ఖండ్ డైనమైట్ గా గుర్తింపు సంపాదించుకున్న ధోని 2020లో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

జట్టు కెప్టెన్ గా ఉంటూ ముందుకు నడిపిస్తున్నాడు. రీసెంట్‌గా ధోని కి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న సినిమాలో ధోని కనిపించబోతున్నాడు. తొలి చిత్రంలోనే విలన్ క్యారెక్టర్ ను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, త్వరలోనే ఈ వార్తలపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఇందులో ఓ కీలకపాత్ర వహిస్తున్నాడు.

త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. లియో సినిమా కంప్లీట్ కాగానే దర్శకుడు వెంకట్ ప్రభు తో కలిసి విజయ్ ఓ మూవీ చేయబోతున్నాడు. 68 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్‌ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా జ్యోతిక నటిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నాడు. రీసెంట్గా ధోని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ‘లెట్స్ గెట్ మ్యారేజ్’ అనే నేతమిళ్ సినిమాను నిర్మించాడు. ధోని నటుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఆయన భార్య సాక్షి తెలిపింది. మంచి కథ, సందేశం ఉన్న క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాడని చెప్పింది. విజయ్ సినిమాలో ధోని కనిపించబోతున్నాడనే వార్తతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.