శరీరంలో వణుకు, నరాల బలహీనత, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయా…. అయితే తప్పకుండా ఇది తినాల్సిందే….!!

ఉసిరికాయలు మనకు ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి. మిగతా రోజుల్లో మనకు ఉసిరికాయ జ్యూస్ లభిస్తుంది. ఉసిరికాయలను ముక్కలు చేసి ఎండబెట్టి వాడుతూ ఉంటారు. వీటిని డ్రై ఆమ్లా అని కూడా అంటారు. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఆయుర్వేదం మందుల షాపుల్లోనూ ఇవి ఉంటాయి. ఉసిరికాయలు మాదిరిగానే ఎండబెట్టిన ఉసిరికాయల్ని కూడా వాడుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. డ్రై అమ్లా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎండ పెట్టిన ఉసిరిముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇది ఫ్రీ రియాక్ట్రికల్ భారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీనివల్ల కణజాలం సురక్షితంగా ఉంటుంది. ఎండిన ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్, దగ్గు ,జలుబు ఇలా అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఎండిన ఉసిరిముక్కలను తినటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధక స‌మ‌స్య‌ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు సరవుతుంది.

దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది.ఎండిన ఉసిరిముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి.
ఇది తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముడతలు కూడా తగ్గిపోతాయి. ఎండిన ఉసిరికాయ ముక్కలను తిన్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల గుండె, కొలెస్ట్రాల్, బరువు, ఆందోళన, వణుకు లాంటి సమస్యలు రావు. ఎండిన ఉసిరికాయ ముక్కలు నాలుగు లేదా ఐదు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు.