మహేష్ ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా మొదట అనుకున్న కథ అది కాదా.. అదేంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సినిమా వన్ నేనొక్కడినే. టైటిల్ తోనే భారీ అంచనాల క్రియేట్ చేసిన ఈ మూవీ 2014లో ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. టైటిల్‌తో హైప్‌ పెంచిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. మాస్ ఇఒమేజ్ ఉన్న మ‌హేష్‌ని మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా చూపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ సినిమాకు ముందు అనుకున్న కదా అది కాదట.

 

అనుకున్న విధంగా సినిమాను తీసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది అంటూ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిర్మాతకు కూడా అసలు కథను వినిపించాడట. ఆ కథ వినేటప్పుడు నిర్మాత చాలా ఎక్సైట్ అయ్యాడని అయితే సినిమా షూటింగ్ జరిగే టైంలో మార్పులు చేర్పులు చేసి కథ మొత్తం మారిపోయింది అని హీరోమిజం తగ్గి ఎమోషనల్ వే ఎక్కువై సినిమా ఆడలేదనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ ఫస్ట్ కథ ఏంటా అనుకుంటున్నారా..? ఇంటర్వెల్ ముందు వరకు హీరోని ఒక మానసిక సమస్యతో చూపించిన సుకుమార్ ఇంటర్వెల్ టైమ్‌కి హీరోకి అసలు ఎటువంటి సమస్య లేదని అదంతా జస్ట్ మహేష్ ప్లే చేసిన గేమ్ అని చూపించాలనుకున్నాడట.

అయితే సినిమా షూటింగ్ టైంలో కేవలం హీరోయిజం మాత్రమే కనిపిస్తుంది.. ఎమోషన్స్ క్యారీ అవ్వడం లేదన్న ఉద్దేశంతో క‌ధ‌ని ఎమోషనల్ వైపు సాగించాను అలా వచ్చిన కాదే మనం చూసిన సినిమా. ఈ రిలీజ్ అయిన వర్షన్‌ అవుట్ ఫుట్ లో కూడా కొన్ని సీన్స్‌ డిలీట్ చేసాం. అందువల్లే ఈ సినిమా ప్రేక్షకులకు అర్థం కాలేదు అనుకుంటా.. కొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా బ్లాక్ బస్టరై ఉండేది. అది నా తప్పే అంటూ సుకుమార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.