ఆ పెళ్లైన హీరోయిన్ విజ‌య్ దేవ‌ర‌కొండకు మోస్ట్ ఫేవ‌రెట్ అట‌.. తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ యంగ్ స్టార్ `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది.

ఈ రొమాంటిక్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. రీసెంట్ గా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తో కలిసి ‘ఖుషి’ మూవీ టీంని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్లతో పాటు దర్శకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంట‌ర్వ్యూ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. చాలా ఫ‌న్నీగా ఈ ఇంట‌ర్వ్యూ సాగింది. ఖుషి టీమ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ సుమ రాపిడ్ ఫైర్ లో భాగంగా విజ‌య్‌, స‌మంత‌ల‌ను ఒక‌రి గురించి మ‌రొకరిని ప్ర‌శ్న‌లు వేసింది. సమంత కి నచ్చని ఫుడ్ ఏంటని? సుమ‌ అడిగితే.. విజయ్ `నాన్ వెజ్‌` అని ఆన్సర్ ఇచ్చారు. విజయ్ కి నచ్చని ఫుడ్ ఏంటని? సమంతని అడిగితే `స్వీట్స్‌` అని పేర్కొంది. సమంతకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడ‌గ‌గా.. వెంట‌నే విజ‌య్ `నేనే` అని తెలిపాడు. అలాగే విజ‌య్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రు..? అని ప్ర‌శ్నించ‌గా.. స‌మంత `అలియా భ‌ట్‌` అని స‌మాధానం చెప్పింది. అప్పుడే అంద‌రికీ పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లైన బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ విజ‌య్ మోస్ట్ ఫేవ‌రెట్ అని అంద‌రికీ తెలిసింది. ఇంత‌కుముందు ఎప్పుడూ ఈ విష‌యాన్ని విజ‌య్ రివిల్ చేయ‌లేదు. ఇప్పుడు స‌మంత చెప్ప‌డంతో.. ఈ విష‌యం కాస్త వైర‌ల్ గా మారింది.