త్వరలో గుడ్ న్యూస్ చెప్తానంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!

బుల్లితెర నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో జగతి పాత్రలో నటించి ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇందులో సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

జ్యోతి రాయ్ కి పెళ్లి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే భర్తతో కాకుండా ఓ డైరెక్టర్ తో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జ్యోతి రాయ్ ట్విట్టర్ లో ఏకంగా తన పేరులో డైరెక్టర్ సుకు పూర్వజ్ పేరు కలుపుకుని అకౌంట్ ఓపెన్ చేసింది.

తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘ త్వరలో గుడ్ న్యూస్’అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా డైరెక్టర్ సుకు పూర్వజ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజెన్స్ పెళ్లి కానీ, చేసుకుంటున్నారా అని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.