శ‌న‌గ‌పిండిలో ఇంత ఆరోగ్యం దాగి ఉందా… ఒక్క‌సారి తెలిస్తే ఏ వంట వ‌ద‌ల‌రు..!

గోధుమతో పోలిస్తే సెనగపిండిలో క్యాలరీలు తక్కువ… ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. శనగపిండితో అనేక వంటకాలు తయారు చేస్తారు. అలాగే నలుగు పెట్టుకోడానికి కూడా సెనగపిండిని బాగా ఉపయోగిస్తారు. ఇక శ‌న‌గ‌పిండి ఉప‌యోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.

• శనగ‌పిండిలో గ్రూటెన్ ఉండదు కాబట్టి చాలా రకాల అలర్జీలను కలిగించదు.

• శనగల గ్లైసీమిక్ విలువ తక్కువ. కాబట్టి సెనగపిండి వల్ల అంతా త్వరగా బరువు పెరగరు.

• శనగ పిండిలో తక్కువ గ్లైసీమిక్ విలువ కారణంగా డయాబెటిస్ రోగాలకు ఔషధం అవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గోధుమల కంటే దీనితో చేసిన పరోటాలు, రోటీలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.

• శెనగలని నీటిలో కడిగి వండ‌టంవల్ల శెనగపిండి వాడేవారు గుండె ఆరోగ్య దీర్ఘకాలం పాటు బాగుంటుంది. శెనగపిండి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

• శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకు దీనితో చపాతీలు తయారు చేసి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ఉండే ప్రోటీన్స్ వల్ల ఎదిగే పిల్లలకు ఎముకలు బాగా గట్టిపడతాయి.

• ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళలు దీన్ని వాడటం వల్ల ఎంతో మేలు చేస్తుంది.

• శనగపిండి కాస్త కడుపు ఉబ్బరం కలిగిస్తుంది అందుకే మల్టీగ్రెయిన్స్ వాటితో కలిపి తీసుకుంటే ఈ పొట్ట ఉబ్బరం వంటిని తగ్గిస్తాయి.