వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన చిత్రం `భోళా శంకర్`. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2015లో విడుదలైన కోలీవుడ్ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది.
భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ లభించింది. కనీసం మెగా ఫ్యాన్స్ ను కూడా ఈ మూవీ మెప్పించలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భోళా బొక్క బోర్లా పడింది. చిరంజీవి నుంచి వచ్చిన రీసెంట్ చిత్రాల్లో ఆచార్యనే పెద్ద డిజాస్టర్ అని అనుకున్నారు. కానీ, దానికి మించిన డిజాస్టర్ ఫలితాన్ని భోళాశంకర్ అందుకుంది.
దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా.. పావు వంతు కలెక్షన్స్ ను కూడా సాధించలేకపోయింది. భోళా శంకర్ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్లు కంటే లోపే షేర్ వసూళ్లను అందుకుంది. అలాగే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. మెగాస్టార్ కెరీర్‌లో తొలిసారి జీరో షేర్ అనే మాట ఈ సినిమా వల్లే వినాల్సి వచ్చింది. ఫైనల్ గా భోళా శంకర్ కు రూ. 50 కోట్ల రేంజ్ లో నష్టాలు ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు.