ఈ ఒక్క ఆకుతో కిడ్నీలో రాళ్లు మ‌టుమాయం… మ‌చ్చుకైనా క‌నిపించ‌వ్‌..!

ఈ జనరేషన్ లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. స్టెప్ బై స్టెప్ మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వీటితో పాటు నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు మరియు పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఇతర అనారోగ్య సమస్యల మందులు రోజువారీగా వాడడం లాంటి కారణాల తో కిడ్నీలలో రాళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ స్టోన్ సమస్య కారణంగా కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ జ్వరం, యూరినరీ ఏరియాలో మంట, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం ఇలాంటి ఎన్నో భయంకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సాధారణంగా ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి వైద్యులు సస్త్ర చికిత్సలను, మందులను సూచిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం కిడ్నీలో రాళ్లను తీసేయవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు.. ఈ సమస్య మరింత తీవ్రం కాకూడదని భావించిన వారు రణపాల ఆకును తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకులో ఫైట్ కెమికల్స్ తో పాటు 12 రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయట. సాధారణంగా కిడ్నీలో పేర్కొన్న క్యాల్షియం ఆక్సలైట్స్ తో కలిసి రాళ్లుగా ఏర్పడతాయి. రణపాల ఆకును తీసుకోవడం వల్ల వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు కాలుష్యం మరియు ఆక్సలైట్స్ కలవకుండా చేప్తుంద‌ట‌.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంద‌ట‌. అలాగే స్టోన్ క‌ణాలు దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా రణపాల ఆకు ఎంతగానో దోహదపడుతుందట. కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు 4 రణపాల ఆకులను తీసుకుని 200 ml నీటిలో వేసి 100 ml అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుందట. అలాగే ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. ఈ విధంగా రణపాల ఆకుని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.