రామ్ – బోయ‌పాటి స్కంధ‌ బిజినెస్ మోత మోగుతోంది… రామ్ కెరీర్ హ‌య్య‌స్ట్‌…!

రామ్ పోతినేని మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఇన్నాళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు అందుకున్న రామ్ మాస్ హీరోగా కూడా తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికీ ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ని రామ్ పోతినేని సొంతం చేసుకున్నాడు. రామ్ సక్సెస్ అందుకున్న సినిమాలన్నీ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే. ఒక ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ హీరోగా రామ్ పోతినేని హిట్ కొట్టాడు. ఈ సినిమా రామ్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. దీని తర్వాత కెరీర్ పరంగా కాస్త నెమ్మదిగా మాస్ అండ్ యాక్షన్ టచ్ లో ఉన్న కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రామ్.

చివరిగా రామ్‌ ద వారియర్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఇది ఊహించిన రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఈసారి ఎలాగైనా కచ్చితంగా హిట్ కొట్టాలని కసితో బోయపాటి డైరెక్షన్లో స్కంధ మూవీలో నటిస్తున్నాడు. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పండగలా ఉంటుంది. అతని సినిమాల్లో ఫ్యామిలీ టచ్ ఉన్న అంతకుమించి పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా గూస్ బమ్స్ తెప్పించే విధంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి దర్శకుడుతో రామ్ పాన్ ఇండియా లెవెల్ మూవీ అంటే స్కంధ‌ మూవీకి ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సాంగ్స్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక‌ సినిమాకి ఇప్పటివరకు థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ.50 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తుంది. డిజిటల్ సాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు సగానికి పైగా రిటర్న్స్ నిర్మాత అకౌంట్లోకి చేరాయ‌ట‌. ఇక ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. బోయపాటి సినిమాకు హిందీలో కూడా మంచి ఆదరణ ఉంది కాబట్టి బాగానే బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ సాదిస్తే పూరి జగన్నాథ్‌తో నటించబోతున్న డబ్బుల్‌ ఇస్మార్ట్ బిజినెస్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.