HBD: నాగార్జున స్టార్ అవ్వడానికి కారణం వారెనా..?

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే అందరికీ మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. ఈరోజు నాగార్జున 64వ బర్త్ డే సందర్భంగా నాగార్జున గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నాగార్జున దాదాపు 8 నెలల వయసు ఉన్నప్పుడే వెండితెర పైన కనిపించారు. తన తండ్రి నటించిన వెలుగునీడలు సినిమా తర్వాత సుడిగుండాలు సినిమాతో బాలనటుడుగా నటించారు. 1986లో విక్రమ్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది.

Happy Birthday Nagarjuna: Mohanlal, Mahesh Babu, Chaitanya, Samantha  Akkineni and other celebs wish actor on turning 61

త్రిమూర్తులు ,రావు గారి ఇల్లు, ఘటోత్గతుడు, నిన్నే ప్రేమిస్తా ప్రేమమ్, తదితర చిత్రాలలో అతిధి పాత్రలో కనిపించారు తమిళ్ హిందీలో కూడా నాగార్జున నటించడం జరిగింది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు.. తన 36 ఏళ్ల సినీ కెరియర్లో 40 మంది కొత్త దర్శకులను తెలుగుతులకు పరిచయం చేశారు.. ఆ క్రమంలోనే వచ్చినవి శివ ,మాస్, వైల్డ్ డాగ్ తదితర చిత్రాలు కొత్త దర్శకులతోనే తెరకెక్కించారు. కొత్త దర్శకులతో సినిమా చేస్తే తన పాత్రలు కూడా కొత్తగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు నాగార్జున.

అందుకే నూతన దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటానని తెలిపారు. అయితే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా సరే విజయాన్ని అందుకున్న నేను ఈ రోజున ఇంత స్టార్ ని అయ్యానంటే అందుకు కారణం కొత్త దర్శకులు వారి ఆలోచనల వల్లే అంటూ నాగార్జున తెలియజేస్తూ ఉంటారు.. ఇక అభిమానించే అభిమానులు కూడా తనకి సపోర్టుగా ఉండటం వల్ల స్టార్ పొజిషన్ ని ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నానని తెలిపారు నాగార్జున. నాగార్జున ఎంతోమంది హీరోలతో కూడా స్క్రీన్ ని షేర్ చేసుకోవడం జరిగింది. తన కుటుంబంతో కలిసి నటించిన మనం సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అక్కినేని కుటుంబానికి.