నిల‌బ‌డి తింటే ఆరోగ్యానికి ఇంత ప్ర‌మాద‌మా….!

ఆహారంలో మార్పులు, సమయాభావం కారణంగా… తరచుగా హోటలళ్లలో లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే, అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆహారం తినేటప్పుడు కొందరికి ఒక అలవాటు ఉంటుంది. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అలా తినాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఏంటి అలవాటు? ఎలా తింటారు? ఒకవేళ అలా తింటే ఏం జరుగుతుంది? అనేగా మీ సందేహం. చాలామంది నుంచుని తింటూ ఉంటారు. పెళ్లిళ్లలో, లేదా ఏదైనా ఫంక్షన్స్ లో నుంచుని తింటారు. ఒకసారి అయితే పర్వాలేదు కానీ అదే పనిగా తరచూ నిలబడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నిలబడి తినడం వలన కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
• నిలబడి ఆహారం తినడం వలన మ‌న ఆకలిపై సరైన అవగాహన ఉండదు. ఫలితంగా ఎక్కువ గానీ ఆహారం తీసుకునే అవకాశం ఉంది. చాలావరకు నిలబడి తినే వ్యక్తులు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా కడుపు నిండి, అసౌకర్యానికి గురవుతారు.

• మనం నిలబడి ఆహారం తింటున్న సమయంలో పేగులు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆహారం జీర్ణం కాదు. మన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది.

• నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం చూపిస్తుంది. నొప్పి వస్తుంది. నిలబడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

• నిలబడి ఆహారం తీసుకోవడం వలన గొంతు నుంచి కడుపులోకి నేరుగా ఆహారం పడిపోతుంది. ఫలితంగా అన్నవాహికపై దుష్ప్రభవం పడుతుంది.అల్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

•నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరుగుతుంది.