పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించారు.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. పుష్ప సినిమా విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు కావోస్తోంది.. పుష్ప చిత్రం విడుదలైన రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నార్త్లో మంచి కలెక్షన్లు సాధించి దాదాపుగా రూ.350 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Did Pushpa 2: The Rule Poster Ft. Allu Arjun Leave You Curious? Here's The  Story Behind His Vibrant New Avatar

ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ని శరవేగంగా చేయబోతున్నారు చిత్ర బృందం మొదటి భాగం కంటే రెండో భాగం పై మరింత శ్రద్ధ పెట్టి సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవలే పుష్ప-2 సినిమాకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేయగా మంచి హైప్ ఏర్పడింది. దీనికి తోడు జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడింది నేషనల్ వైడ్ గా రావాల్సిన పబ్లిసిటీ రాని వచ్చేసిందని చెప్పవచ్చు.. పుష్ప మొదటి భాగానికి అల్లు అర్జున్ దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు.

కానీ పుష్ప రెండోభాగానికి డబల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ ప్రస్తుతం ఒక్క చిత్రానికి తీసుకుంటున్న రూ .150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో అల్లు అర్జున్ కూడా అంతే డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఏరియా హక్కులను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కూడా అల్లు అర్జున్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం కాలర్ ఎగరేస్తున్నారు.