తమిళనాడులో చిరంజీవి చాలా పెద్ద హీరో….. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ (వీడియో)…..!!

తమిళ స్టార్ కమల్ హాసన్ ఇటీవల ‘విక్రమ్’ చిత్రంతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తునే తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్, స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి బోల్తా పడ్డాడు. చిరంజీవికి భోళాశంకర్ మరో ఆచార్యా అని అనుకోవచ్చు. తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూ కు హాజరయ్యాడు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి తమిళనాడులో చాలా పెద్ద హీరో. ఆయనకు ఇష్టం లేదు అంతే అదే రీసన్. ఒకసారి ఏఎన్ఆర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనను అడిగాను.

మీరు ఎందుకు అక్కడ అంతా ఫాలోయింగ్‌ను వదులుకొని వచ్చారు అని.. అప్పుడు ఆయన చెప్పింది ఏమిటో నేనెప్పుడూ మర్చిపోలేను. అప్పుడు ఆయన ఓ తుఫాను వచ్చిందయ్యా అనీ అన్నారు. ఆ తుఫాను పేరు శివాజీ అని చెప్పారు”అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు.కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by @ManiChary (@mani_prabhas97)