శ‌రీరంలో పెరిగే యూరిక్ యాసిడ్‌కు త‌మ‌ల‌పాకుతో చెక్ పెట్టండిలా…!

ఈ మధ్యకాలంలో జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యసిడ్ పెరగడం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది.యూరిక్ యసిడ్ స్థాయి పెరగడాన్ని “హైపర్ యూరిసెమియా” అంటారు. యూరిక్ యసిడ్ లెవెల్స్ పెరగడంతో కీళ్ల నొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడి.. ఇంకొన్ని వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి. సాలిడ్స్‌లా మారి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి. తమలపాకులు వల్ల ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. మరి ఈ ఆకులను ఎలా వాడాలో మరియు వాటి వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకులు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల అసౌకర్యం మరియు నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి. అంతేకాకుండా రుమటాయిడ్ అర్టరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా నివారణ కలిగిస్తుంది.

దీనికోసం రోగులు రోజు ఉదయాన్నే తమలపాకును నమలి, ఆ రసాన్ని మింగాలి. ఇలా తరచూ తినడంతో యూరిక్ యసిడ్ స్పటికలా స్థాయిలను కరిగించి, యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. అయితే తమలపాకు తినేట‌ప్పుడు పొగాకు మాత్రం అస్సలు నమ‌ల కూడదు. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు తమలపాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.