కమెడియన్ రాజబాబు చేసిన తప్పు వల్లే కష్టాలను అనుభవించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ అలనాటి కమెడియన్ రాజబాబు వెండితెరపై ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. తనలోని కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాజబాబు. దాదాపుగా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబు నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అయితే తాజాగా రాజబాబు గురించి ప్రముఖ నటుడు కాకరాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

రాజబాబు తనకంటే ఒక ఏడాది పెద్దవారు అని అయినప్పటికీ తనని అన్నయ్య అని పిలిచేవారని.. మా ఇద్దరి అనుబంధం వేరే అని, అదే చివరి వరకు కొనసాగిందని తెలిపారు కాకరాల.. రాజబాబుది జాలి గుండె.. ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడలేరు మనుషుల్ని ఎంతో గొప్పగా ప్రేమించేవారు. ఆయన నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకోలేక పోయినప్పుడు చాలా బాధపడే వారిని తెలిపారు కాకరాల. ఇలా ఒకసారి కాదు ఎన్నో సందర్భాలలో కూడా జరిగిందని తెలిపారు. నటుడుగా ఉన్న సమయంలో నిర్మాతగా మారారు..

మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమాని తన సొంత బ్యానర్ లోనే తెరకెక్కించారని.. రాజబాబు తణుకు చెప్పారని తెలిపారు. దీంతో టైటిల్ కూడా నెగిటివ్ గా ఉందని చెప్పారట కాకరాల. దీంతో సినిమా పైన సందేహాలు కూడా చెప్పేవాడిని కానీ ఆ మాటలు పట్టించుకోలేదు. ధైర్యంగా ఈ సినిమాని నిర్మించారు. ఆయనతో అప్పటినుంచి ఆర్థికంగా ఆయన పరిస్థితి తారు మారయింది. ఇబ్బందులు తట్టుకోలేక రోడ్డున పడ్డారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు.. సమాజం అనే సినిమాతో 1960వ సంవత్సరంలో రాజబాబు నటుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ఒక బ్రాండ్ గా పేరును సంపాదించారు. చివరిగా రాజబాబు బంగారు భూమి అనే చిత్రంలో నటించారు. అయితే రాజబాబు నిర్మాతగా మారకుండా ఉండి ఉంటే తన కెరియర్ మరొక లాగా ఉండేది.