సౌత్ స్టార్ బ్యూటీ సమంత నుంచి త్వరలోనే `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత అమెరికాలో ఉండటంతో.. ఖుషి ప్రమోషన్స్ ను విజయ్ తన భుజానకెత్తుకున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. అయితే అమెరికాలో ఉన్న సమంత.. అక్కడ నుంచే ఖుషిని ప్రమోట్ చేస్తోంది. శుక్రవారం న్యూయార్క్ లో ఖుషిని ప్రమోట్ చేసేందుకు అక్కడ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సమంత కూడా మెరిసింది.
`నా ప్రతి సినిమా ఆదరిస్తూ నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు చాలా పెద్ద థాంక్యూ. రేపు రిలీజ్ అయ్యబోయే ఖుషిని కూడా తప్పక చూడండి. మీకు బాగా నచ్చుతుంది` అంటూ సమంత పేర్కొంది. అయితే ఈవెంట్ లో సమంత ఉన్నది కొద్ది సేపే అయినా.. నిర్వాహకులు మాత్రం ఆమెకు ఏకంగా రూ. 30 లక్షలు ముట్టజెప్పారట. మరొక ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్ లో ఎవరికీ ఫ్రీ ఎంట్రీ లేదు. ఈవెంట్ నిర్వాహకులు రూ. 12 వేల నుంచి 2 లక్షల వరకు ఎంట్రీ టికెట్ల ధరను నిర్ణయించారు. అయినా కూడా కొద్ది నిమిషాల్లోనే టికెట్స్ అమ్ముడుపోయాయి. సమంతను చూసేందుకు అక్కడి అభిమానులు టికెట్స్ మొత్తాన్ని కొన్నేశారట. ఈ విషయం తెలిసి అమెరికాలో సమంత మ్యానియా మామూలుగా లేదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.