హీరో ఉదయ్ కిరణ్ చెల్లి టాలీవుడ్ లోనే టాప్ సింగర్ అనే విషయం మీకు తెలుసా..!?

టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాడు. వరుస‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తను నటించిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది.

ఇక ఆయనకు వచ్చిన క్రేజ్‌ చూసి అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న హీరోలు సైతం భయపడ్డారు. ఇక కెరీర్ లో మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే ఉదయ్ కిరణ్ జీవితం ఎవరు ఊహించిన విధంగా మారిపోయింది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ ఎంతో ఇబ్బంది పడ్డారు.. ఆస‌మ‌యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఉదయ్ కిరణ్ చెల్లి టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ అనే విషయం చాలామందికి తెలియదు.

ఇక ఆ అమ్మాయి మరెవరో కాదు పర్ణిక… ఈమె బాహుబలి, భీమ్లా నాయక్ వంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో ఇప్పటివరకు పర్ణిక‌ 100కు పైగా పాటలు పాడింది. పర్ణికకి, ఉదయ్ కిరణ్ వరుసగా అన్నయ్య అవుతాడు. పర్ణిక పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.. అంత మంచి వ్యక్తి అలా మరణించడం ఎంతో బాధగా ఉందంటూ ఆమె ఎన్నోసార్లు తన బాధను కూడా వ్యక్తం చేసింది.