అక్కినేని సుప్రియ భర్తకి హీరోయిన్ శ్రియకి ఉన్న సీక్రెట్ రిలేషన్ ఏమిటో మీకు తెలుసా..!?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వారిలో యార్లగడ్డ సుప్రియ కూడా ఒకరు.. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో ఈమె కూడా హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ప‌లు సినిమాల్లో నటించిన సుప్రియ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటు వచ్చింది. అలాగే ఈమె నిర్మాతగా కూడా కొనసాగింది.

ఇదే సమయంలో అడివిశేష్‌ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో సుప్రియ రీఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాలో నటించిన ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటుంది. ఇదే సమయంలో ఈ అక్కినేని మేనకోడలు సుప్రియ భర్త చరణ్ రెడ్డి అంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన బతికి లేరు చనిపోయారు. ఇక చరణ్ రెడ్డి కూడా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి హీరోగా కూడా చేశాడు. ఈయన ఇష్టం అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

అప్పట్లో చాలా మంది కొత్త ఆర్టిస్టులను రామోజీరావు గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలానే చరణ్ రెడ్డిని కూడా ఇష్టం అనే సినిమాలో అవకాశం వచ్చింది. తొలి సినిమా అంతగా ఆడకపోవటంతో ఆ సినిమా తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సుప్రియ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయ్యాక సుప్రియ- చరణ్ రెడ్డి ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత చరణ్ రెడ్డికి సినిమా అవకాశాలు లేక సుప్రియ కూడా ఖాళీగా ఉండటంతో ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవట. ఆ గొడవల్లో విసిగిపోయిన చరణ్ రెడ్డి మద్యపానానికి బానిస అయ్యారట.

ఇక భర్త తాగి రావటం చూసి సుప్రియ గొడవ పడటం స్టార్ట్ చేసిందట. ఇక దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. దాంతో సుప్రియ తన తాత నాగేశ్వరరావు ఇంటికి వచ్చేసిందట. ఆ తర్వాత సుప్రియ‌ తన భర్త చరణ్ రెడ్డికి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంది. ఇక వైపు సినిమాల్లో అవకాశాలు రాక మరోవైపు కట్టుకున్న భార్య కూడా దూరం అవటంతో చరణ్ రెడ్డి తీవ్రమైన మనస్థాపానికి లోనై మరింత మద్యపానానికి బానిస అయ్యాడట. దాంతో అవయవాలు చెడిపోయి. హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

ఇక చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే చర‌ణ్‌ రెడ్డి చనిపోయే వరకు కూడా సుప్రియ భర్త అనే విషయం ఎవరికీ తెలియదు.ఇక సుప్రియ భర్త చరణ్ రెడ్డికి, హీరోయిన్‌ శ్రీశ్రియ‌ కి మధ్య ఉండే రహస్య సంబంధం ఏంటి అంటే చరణ్ రెడ్డి శ్రియ కాంబినేషన్లో ఇష్టం సినిమా వచ్చింది. ఈ సినిమాతో చరణ్ రెడ్డి, శ్రియ‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి శ్రియ హీరోయిన్గా స్టార్ స్టేటస్ కి వెళ్లి ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటే చరణ్ రెడ్డి మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.