3 సార్లు నామినేట్ అయ్యి నేష‌న‌ల్ అవార్డు మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవ‌రో తెలుసా?

69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది. భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో స‌హా మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. పుష్ప సినిమాకుగానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడు అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు చిత్రసీమకే ఎంతో గర్వకారణం. ఎందుకంటే, 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జునే. దీంతో సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. అయితే అల్లు అర్జున్ కు అవార్డు వ‌చ్చినందుకు మెగా ఫ్యాన్స్ ఓవైపు ఆనంద‌ప‌డుతూనే.. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో బాధ‌ప‌డుతున్నారు.

ఎందుకంటే, ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ ఒక‌టి రెండు కాదు మూడు సార్లు నామినేట్ అయ్యి నేష‌న‌ల్ అవార్డును మిస్ చేసుకున్నాడు. మ‌గ‌ధీర‌, రంగస్థలం మ‌రియు ఆర్ఆర్ఆర్ సినిమాల‌కు గానూ రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అయ్యాడు. కానీ జూరీ నిర్ణయంతో అవార్డు మాత్రం అందుకోలేక‌పోయాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టేటస్‌ సంపాదించుకున్న‌ రామ్‌ చరణ్‌.. ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ప్రెస్టీజియస్ అవార్డ్‌గా భావించే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు. ఈ విష‌యం ప‌ట్ల మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.