చిరు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్.. వెంక‌టేష్ బంపర్ హిట్ కొట్టాడుగా.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?

చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు. ఒక కథ ఒక హీరోకి నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు.. అదే కథను మరో హీరో సినిమాగా చేసి సూపర్ హిట్ అందుకుంటాడు. ఇక్కడ సినిమాల కథల‌ను ఎంచుకోవడంలో కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడే విజయాలు వస్తాయి. గతంలో ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక సినిమా విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అలా ఓ సినిమా చిరంజీవి నుంచి చేజారింది మరి ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అణ్ణామ‌లై సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో కృష్ణంరాజు నటించిన ప్రాణ స్నేహితులు సినిమా కాస్త అటూ ఇటుగా మార్చి తమిళంలో తెరకెక్కిస్తే అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ ఎక్కువ రేటు కోట్ చేసి ఆ సినిమా రీమేక్ హక్కులు పొందారు.

మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఆయన వస్తున్న ఫ్లైట్ లోనే చిరంజీవి కూడా ఉన్నారు. ఇక దాంతో సత్యనారాయణ ఆ సినిమా స్టోరీ గురించి చిరంజీవికి చెప్పగా ఆయన ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి ఓకే చెప్పారన్న ఆనందంతో నిర్మాత తన ప్రస్తుతం చేస్తున్న సుందరకాండ షూటింగ్ లోకేషన్ కి వెళ్ళాడు.

అయితే ఆ సమయానికే అణ్ణామ‌లై రీమేక్ రైట్స్‌ తీసుకున్నారని విషయం వెంకటేష్ కు తెలిసింది. ఇక వెంకటేష్ వెంటనే నా తర్వాత సినిమా కూడా మీతోనే చేస్తాన్ని చెప్పడంతో సత్యనారాయణ షాక్ అయ్యారు. అప్పటికే ఆయన వెంకటేష్‌తో సుందరకాండ సినిమా చేస్తున్నాడు. వెంకీ తన తర్వాత సినిమా కూడా అదే బ్యానర్ లో చేసేందుకు ఓకే చెప్పడంతో వెంకటేష్‌తో వరుసగా రెండు అవకాశం వచ్చినందుకు ఆనందపడాలో లేదా చిరంజీవితో చేస్తాను అని చెప్పినందుకు బాధపడాలో తెలీక నిర్మాత కాస్త డైలమాలో పడ్డారు.

అప్పటికే వెంకటేష్ తో సినిమా చేస్తుండడంతో ఆయనతోనే తన తర్వాత సినిమా కూడా చేయక తప్పలేదు. అలా వెంకటేష్ చేసిన సినిమా కొండపల్లి రాజా. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో సుమన్ కూడా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇందులో వెంకటేష్‌కు జంటగా నగ్మా నటించింది. ఈ సినిమాకు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ విధంగా చిరంజీవి చేయాల్సిన కొండపల్లి రాజా సినిమా కాస్త వెంకటేష్ హీరోగా వచ్చింది.