దక్షిణ భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది ప్రజలను ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు, గాయకుడు దేవి శ్రీప్రసాద్. దేవి మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. ఈయన అప్పటి సినిమాలు నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు, ఆర్య నుంచి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో చిత్రాలకు తను మ్యూజిక్ అందించాడు.
మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా చాలా బాగా పాడుతారు. అయితే దేవిశ్రీప్రసాద్ ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నా పర్సనల్ లైఫ్ ఇంకా సెట్ కాలేదు. ఎందుకంటే 40 కి పైగా వయసు దాటినా కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం గతంలో సినీ నటి ఛార్మి తో ప్రేమలో పడి అది ఫెయిల్ కావడమే అన్న పుకార్లు వచ్చాయి.
ఛార్మీతో బ్రేకప్ అయ్యాక దేవీకి ప్రేమ ,పెళ్లి పై తనకి నమ్మకం పోయిందని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పెళ్లి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మామ అనే ఐటెం సాంగ్ పాడి ఓవర్ నైట్ లోని స్టార్ సింగర్ అయిపోయింది మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి.
ఇప్పుడు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఇంద్రావతి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది సమయంలోనే నెట్టింట వైరల్ గా మారాయి. మీ జంట చాలా బాగుంది. మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు, ఎస్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది అసలు మ్యాటర్..!