ప్రస్తుతం వాల్తేరు వీరయ్య హిట్‌తో మంచి జోష్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరోసారి సూపర్ హిట్ కొట్టేందుకు ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో 6 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ ధరలు పెంచడం కామన్ అయిపోయింది.
దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. చిరు మూవీ టికెట్ ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. థియేటర్లలో ప్రస్తుతం ఉన్న ధరలే భోళా శంకర్ సినిమాకు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే హైదరాబాదులో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.
ఇక మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి లుక్స్ తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భోళా శంకర్ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకి రానుంది.