MS. ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న చదువుకు ఎంత ఖర్చు అవుతుందో తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

MS Dhoni Family: Parents, Siblings, Wife, Daughter - All Details

రాంచీలో ఉండే ఉత్తమమైన పాఠశాలలో టౌరీయన్ వరల్డ్ స్కూల్లో జీవ మూడవ తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే జీవా డేస్ కాలర్ చదువుతున్నప్పటికీ తన స్కూలు ఫీజు అక్షరాల రూ.2,75,000 రూపాయలు ధోని దంపతులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం విన్న అభిమానుల సైతం కాస్త ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఒకవేళ ధోనీ కూతురు అకాడమినేషన్ ఉన్నట్లు అయితే ఏడాదికి రూ.4.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండేదట.

MS Dhoni Family Pics With Wife Sakshi and Daughter Ziva: As Former India  Captain Retires From International Cricket, Let's Look at Some of His  Adorable Pictures | 🏏 LatestLY

ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తన తండ్రి ధోనీతో పాటు ఇమే స్టేడియంలో చాలా సరదాగా క్షణాలను గడపడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ధోని కూతురికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇన్స్టా అకౌంట్లో దాదాపుగా 2.3 మిలియన్ల మంది ఫాలో అవర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగే సమయంలో ధోని కూతురు జీవా, భార్య సాక్షి కూడా స్టేడియంలో ఉంటారు. ధోని ఒకవైపు వ్యవసాయ పనులు చేస్తూనే మరొకవైపు అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతూ ఉన్నారు.