నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన భారీ హిట్ సినిమా ‘ బింబిసార ‘ నిన్నటితో ఈ చిత్రం యాడాది పూర్తి చేసుకోగా ఈ సినిమా హిట్ తర్వాత కళ్యాణ్ మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా చేస్తున్న మరో చిత్రమే ‘డెవిల్’. టీజర్ తో సాలిడ్ క్రేజ్ అందుకున్న ఈ సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది.
ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్ ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ని చేయాల్సి ఉంది. కానీ పలు వర్క్స్ మూలాన లేట్ కాగా ఇప్పుడు అయితే మేకర్స్ మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 24న డెవిల్ రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరి, ఆ మరుసటి నెలలో కళ్యాణ్ డెవిల్ సినిమాలతో నందమూరి ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి.
ఇక ఓ ప్రముఖ స్పై జీవిత చరిత్ర ఆధారంగా డెవిల్ తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాకి నిర్మాణం వహించారు.