భోళాశంకర్ అట్టర్ ప్లాప్.. జైలర్ సూపర్ హిట్.. కలెక్షన్ల‌లో ఇంత తేడానా..!

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ , సూపర్ స్టార్ జైలర్ సినిమాలు గతవారం ఒకేరోజు వ్యవధితో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కావడం మంచి క్రేజ్ సంపాదించిన హీరోస్ కావడంతో వీరిద్దరి మధ్యన గట్టి పోటీ ఉంటుందని ఎవరు ఎక్కువ కలెక్షన్స్ వ‌సూళ్ళు చేస్తారో అని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజై బోళాశంకర్ బోల్తాపడగా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళాశంకర్ ఫ్లాప్‌గా నిలిచింది. కీర్తి సురేష్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో నటించిన కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ అంటూ ప‌లు విమర్శలు వచ్చాయి.

ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం రావాల్సిన ఔట్డేటెడ్ సినిమాను మెహర్ రమేష్ చిరంజీవి హీరోగా తరికెక్కించి బోల్తాపడ్డాడు. చాలా కాలం క్రితం వచ్చిన వేదాళంను సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను మరింత అవుట్‌డేటెడ్‌గా తర్కెక్కించాడు. ఇక 5 రోజులలో కేవలం రూ.30 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కూడా సొంతం చేసుకోలేకపోయింది భోళాశంకర్ దానికి తోడు ఈ 5 రోజుల్లోనే చాలా థియేటర్స్ లో భోళా శంకర్ సినిమాను తీసివేసి జైలర్ సినిమాను పెట్టారు. దీంతో మెగా అభిమానులు చిరంజీవి కన్నా ఎక్కువగా చింతించారు.

మ‌రోపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా మొదటిరోజు మొదటి షో తోనే బ్లాక్బస్టర్ హిట్ టాక్‌ని సంపాదించుకుంటూ వరుసగా 5 రోజులు భారీ కలెక్షన్స్ తో రజనీకు మంచి ఊరట ఇచ్చింది. రజినీకాంత్ కూడా గత కొంతకాలంగా సరైన హిట్ అందలేదని చెప్పాలి దానికి తోడు బిస్ట్ సినిమాతో బిగ్గెస్ట్ ప్లాప్‌ని సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కు అవకాశం ఇచ్చి రజిని తప్పు చేశారని అందరూ భావించారు. కానీ సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది. కేవలం తెలుగురాష్ట్రాల‌లో కాక అమెరికాలోనూ తెలుగు వర్షన్ కి జైలర్‌తో 10 లక్షల డాలర్లు వసూలు చేసింది. తెలుగులో డబ్ అయిన సినిమాకు ఇంత భారీ వసూలు రావడం నిజంగానే గొప్ప విషయం.