కన్నీరు మున్నీర‌వుతోన్న సితార‌, న‌మ్ర‌త‌… !

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార ఈ పేర్లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఓ జ్యూవెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన సితారకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. త‌న‌కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక తాజాగా మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వారు గత కొంతకాలంగా పెంచుకుంటున్న ఫ్లూటో చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఫ్లూటో మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, మ‌హూష్ గారాల‌ప‌ట్టి సితార ఒక ఎమోషనల్ పోస్ట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్ లో ఏడేళ్ల బంధం.. మిస్ యు ఫ్లూటో.. అంటూ షేర్ చేసింది.

దానికి స్పందించిన నమ్రత ఫ్లూటో ఎక్కడికి వెళ్లలేదు మన ప్రార్థనలో ఎప్పటికీ మ‌న‌తోనే ఉంటాడు అంటూ సితారకు ధైర్యం చెప్పింది. అంతేకాకుండా ఘట్టమనేని అభిమానుల సైతం ఈ పోస్ట్ కు స్పందించి కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)