63 ఏళ్లలో డ్యాన్సుల్లో దుమ్ము లేపేస్తోన్న బాల‌య్య ( వీడియో )

నందమూరి నట‌సింహ బాలయ్య ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తన నటనతో డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కోట్లలో గ్రాస్ వసూళ్ళు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి మూవీ లో నటిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల బాలయ్య కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో బాలయ్య నటి పూర్ణ తో కలిసి నందమూరి నాయక అనే పాటకు అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ వేశాడు. 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య ఇచ్చిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంటూ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీంతో అన్ స్టాపబుల్ ఓటిటికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.