ఫోన్ పౌచ్‌లో డబ్బులు పెడుతున్నారా….. అయితే మీరు డేంజర్లో ఉన్న‌ట్టే..!

ఇండియాలో చాలామంది స్మార్ట్ ఫోన్‌నే మినీ పర్స్‌లా కూడా వాడేస్తూ ఉంటారు. చాలా మొబైల్ ఫోన్ కవర్లో 10, 50, 500 రూపాయల నోటు కూడా దాచేస్తూ ఉంటారు. అంతేనా ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్ కొంతమంది అమ్మాయిలైతే బస్ కండక్టర్ కి చూపించడానికి అనువుగా ఉంటుందని ఫోన్ బ్యాక్ పౌచ్ లేదా కవర్ వెనుక దాన్ని భద్రంగా పెడుతూ ఉంటారు. అలాగే ఫోన్ కవర్లో ఉంచిన ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో పనికి వస్తుందని చాలామంది అలా చేస్తూ ఉంటారు.

అయితే ఇలా నోట్లు పెట్టుకోవడం ప్రమాదకరమని చాలా మందికి తెలియదు. ఇలా చేయడం ఒక్కోసారి ప్రాణాంతకానికి దారితీస్తుంది. ఇలా ఫోన్ వెనకాల పౌచ్‌లో డబ్బులు పెట్టడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అయ్యి పేలిపోవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నారు. తెలిసి తెలియక మనం చేసే కొన్ని తప్పులు ప్రమాదంలో పడడానికి దారితీస్తాయి.

ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఫోన్ వాడినప్పుడు కానీ హీట్ఎ క్కువ అవుతుంది. ఫోన్ లోపల వేడి బయటకి వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం వల్ల అది పేలే అవకాశం ఉంది. అందుకే మొబైల్ ఫోనుల్లో బిగుతుగా ఉండే కవర్లు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ లోపల వేడి బయటకు రాకపోతే ఫోన్ బాగా హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.

నోట్లు తయారీకి కాగితం, అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. దాంట్లో ఉపయోగించే రసాయనాలు వల్ల ఫోన్ బ్యాక్ సైడ్ పెడితే ఫోన్ వేడికి మంటలు వస్తాయి. అందువల్ల ఫోన్ పౌచ్ లో డబ్బులు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.