స్టైలిష్‌లుక్‌లో క‌వ్విస్తోన్న నమ్రత శిరోద్కర్ సంపాద‌న, ఆస్తుల సీక్రెట్లు ఇవే…!

మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఈమె అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. 50 వయసులో కూడా ఆమె యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈమె మోస్ట్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నగల బ్రాండ్ ప్రమోషన్ల‌లో భాగంగా నమ్రత ఫోటో షూట్ చేసింది. ఆమె లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఇక హీరోయిన్గా రిటైర్ అయినప్పటికీ నమ్రత మోడల్ గా రాణిస్తూ అడపాదడపా సంపాదిస్తుంది.

మరోవైపు సితార కూడా మామూలుగా లేదు. 11 ఏళ్లకే సెలబ్రిటీగా అవతరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. సితార అంతర్జాతీయ నగల బ్రాండ్ పిఎంజే ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. మొదటి యాడ్‌కే సితార రూ.1 కోటి తీసుకుందని సమాచారం. ఆ వయసులో కోటి సంపాదన అంటే మామూలు విషయం కాదు. తన మొదట సంపాదన చారిటీకి ఖర్చు చేశానని సితార చెప్పింది.

మహేష్ కోసం కెరియర్ వదులుకున్న నమ్రత గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుంచి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా ఉంటుంది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రత వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీనిని రహస్య వివాహం అనవచ్చు. మహేష్ కంటే నమ్రత వయసు పెద్దది కావడం విశేషం.

పిల్లలు పెద్దవాళ్లయ్యాక మహేష్ కెరియర్ పై ఆమె ఫోకస్ చేసింది. మహేష్ కు మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా నిలిచింది. మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నెంబర్ తానే చూసుకుంటుంది. అదే సమయంలో మహేష్ నమ్రతాకు చాలా గౌరవం ఇస్తాడు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు.