నాని బిగ్ డిజాప్పాయింట్మెంట్‌… ఎందుకంత బాధ సామీ..!

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో వైరల్ గా మారాడు.

గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించాడు. 2021 ఏడాది అవార్డులకు గాను తెలుగు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ వరించగా… ఆర్ఆర్ఆర్ సినిమాకి ఏకంగా 6, ఉప్పెన సినిమాకి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా నాని కంగ్రాట్స్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

అయితే తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అవార్డు రాకపోవడంపై నాని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాలో స్టోరీస్ లో జై భీమ్ అంటూ లవ్ బ్రేకర్ అయినా సింబల్ ను పెట్టాడు. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడు విభాగంలో సూపర్ స్టార్ సూర్య, ఉత్తమ సినిమా విభాగంలో జై భీమ్ చిత్రానికి వస్తుందని ఆయన అభిమానులు భావించారు.

జై భీమ్ పట్ల నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్.. అట్టడుగు వర్గాలపై పోలీసుల దౌర్జన్యాలను చూపించారు. ఈ కథ ముగ్గురు గిరిజనుల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో మణికందన్, జోస్, ప్రకాష్ రాజ్, రాజేషా విజయన్, గురు సామసుందరం, రావు రమేష్, జయప్రకాష్, ఇళవరసు,ఎలాంగో కుమారవేల్ ప్రధాన పాత్రల్లో నటించారు.