ఆదిపురుష్‌ నుంచి జైలర్ వరకు ఈ ఏడాది తెలుగులో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే..!

2023లో టాలీవుడ్ లో పలు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. కొన్ని సినిమాలు హైప్ కారణంగా అత్యధికంగా మొదట రోజు వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో 2023 విడుదలైన సినిమాల్లో ఆదిపురిష్, బ్రో, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, జైలర్, భోళా శంకర్, సహా ఫస్ట్ డే అత్యధికంగా వసూళ్లని సాధించిన సినిమాలు విషయానికి వస్తే….

ఆది పురుష్:
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. ఈ చిత్రం తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్లు రాబట్టి 2023లో అత్యధికంగా ఫస్ట్ డే వసూలు సాధించిన చిత్రాల్లో నిలిచింది.

వీర సింహారెడ్డి:
నందమూరి నట‌సింహ హీరోగా నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా తొలి రోజు రూ.25.35 కోట్లు రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది.

బ్రో:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన… ఈ చిత్రం సముద్ర గాని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 23.61 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

వాల్తేరు వీరయ్య:
చిరంజీవి, రవితేజ హీరోలుగా శృతిహాసన్ కథానాయికగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.25.35 కోట్లు రాబట్టింది.

భోళా శంకర్:
చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.38 కోట్లు హైట్ ని రాబట్టింది. ఈ ఏడాది ఐదో స్థానంలో నిలిచింది.

దసరా:
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రానికి తొలి రోజు రూ. 14.22 కోట్లు వసూలు చేసింది.

జైలర్:
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై సంచలనం విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ . 12 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా తొలి రోజు రూ. 7.01 కోట్లు రాబట్టింది.