సింహంతో ఫైట్ కు సై అంటున్న బాలయ్య..బాక్స్ ఆఫీస్ కు దబిడి దిబిడే..!

నటసింహం నంద‌మూరి బాలయ్య సీనియర్ స్టార్ హీరోగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. బాలయ్య యంగ్ హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసింది. ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారట. ఈ సెట్లో బాలయ్య సింహం మధ్యనే యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోందని సింహంతో బాలయ్యకు సాగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మంచి హైలెట్ గా నిలవబోతుందని సమాచారం. మరి ఈ సినిమాలో బాబీ.. బాలయ్య ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఏ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా బాలయ్య బ్రాండ్ మార్క్‌ యాక్షన్ డ్రామా కాదట‌. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో తెర‌కుక్క‌బోతున సెంటిమెంట్ డ్రామా అని తెలుస్తోంది.

ఈ సినిమాలో యాక్షన్ కంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా కనిపించబోతుందని.. పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా బాలయ్య‌కి ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ప్రొడ్యూసర్గా ఈ సినిమా రానుంది.